ప్రజాశక్తి-సోమల: మండల కేంద్రమైన సోమల నుంచి నంజంపేట మార్గంలో పాల డెయిరీ, చర్చి, దళితవాడ వద్ద రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతోంది. మండల కేంద్రం నుంచి ఇదే మార్గంలో ఐదు పంచాయతీలకు బస్సులు ఆటోలు ఇతర వాహనాలు వెళ్తూ ఉంటాయి. అసలే గుంతల మాయమైన రోడ్డుపై సోమల, దళితవాడ గ్రామం నుంచి మురుగునీటి కాలువల ద్వారా వచ్చే మురుగునీరు కాలువలు నిండి రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు వెళ్లేటప్పుడు ఇతర వాహనదారులపై మురుగునీరు పడటం పాదాచారులపై మురుగునీరు పడటం జరుగుతోంది. ఇక పాదాచారులు వెళ్లాలంటే మొరుగునీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పంచాయతీ వారు పరిశీలించి మురుగునీరు రోడ్డుపై ప్రవహించకుండా పాదాచారులు వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.a
![రోడ్డుపై మురుగునీటి ప్రవాహం](https://prajasakti.com/wp-content/uploads/2024/12/somala-pala-diary-2-scaled.jpg)