ప్రజాశక్తి – సోమల: మండల కేంద్రమైన సోమల పంచాయతీ దళితవాడ వద్ద సోమల నంజంపేట ప్రధాన మార్గంపై గ్రామానికి చెందిన మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఇబ్బందికరంగా మారుతోంది. గ్రామానికి చెందిన మురుగునీటి కాలువ శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ వాహనాలు అటు ఇటు వెళ్తున్న సందర్భంగా గుంతలు ఏర్పడి ఆ గుంతలలో మురుగునీరు నిలచి రాకపోకలకు అసౌకర్యంగా మారింది. ఈ ప్రాంతంలో కల్వర్టు నిర్మించాలని దళిత వాడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఆర్ అండ్ బి వారు పట్టించుకోకపోవడంతో సమస్య సమస్యగానే మిగులుతోంది. నూతన ప్రభుత్వ నాయకులు సమస్య పరిష్కారానికి కల్వర్టు నిర్మించి రాకపోకలు సజావుగా జరిగేందుకు మార్గం సుగమము చేయాలని దళితవాడ ప్రజలు కోరుతున్నారు.
