పెండింగ్ కేసులు పరిష్కరించండిహైకోర్టు జడ్జి కృష్ణమోహన్ సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు జడ్జి కృష్ణమోహన్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: త్వరితగతిన పెండింగ్ కేసులను పరిష్కరించాలని హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ సూచించారు. శనివారం స్థానిక జిల్లా కోర్టులో న్యాయమూర్తుల వర్క్‌షాపు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు జడ్జి జిల్లాలో పెడింగ్ కేసులపై చర్చించి పరిష్కరించాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాపులో ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జిలు అన్వర్‌భాషా, రాటకొండ మురళి న్యాయమూర్తులకు కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన అంశాలను వివరించారు.
పెండింగ్ కేసులు పరిష్కరించండిహైకోర్టు జడ్జి కృష్ణమోహన్ సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు జడ్జి కృష్ణమోహన్
