రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

Oct 2,2024 21:35
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

ప్రజాశక్తి-సోమల: వాలీబాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు మండలంలోని కందూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు దస్తగిరి బాబా, తనీష్‌ ఎంపికైనట్లు వ్యాయమ ఉపాధ్యాయులు చిన్నబ్బ తెలిపారు. బుధవారం ఆయన వివరాలను వెల్లడించారు. గంగవరం మండల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 1న జరిగిన అండర్‌ 17 రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వివరించారు. కాగా వారిని పాఠశాల హెచ్‌ఎం వెంకటరమణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

➡️