తొలకరి జల్లులతో చిగురించిన ఖరీఫ్‌ ఆశలుశ్రీ పొలాల బాట పట్టిన రైతన్నలుశ్రీ దుక్కులకు అదునుగా వర్షంశ్రీ సకాలంలో అందిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలు

తొలకరి జల్లులతో చిగురించిన ఖరీఫ్‌ ఆశలుశ్రీ పొలాల బాట పట్టిన రైతన్నలుశ్రీ దుక్కులకు అదునుగా వర్షంశ్రీ సకాలంలో అందిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలు

తొలకరి జల్లులతో చిగురించిన ఖరీఫ్‌ ఆశలుశ్రీ పొలాల బాట పట్టిన రైతన్నలుశ్రీ దుక్కులకు అదునుగా వర్షంశ్రీ సకాలంలో అందిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలుప్రజాశక్తి- వి కోట : మండల పరిధిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి జల్లులు మొదలు కావడంతో ఖరీఫ్‌ సీజన్‌ కోసం రైతన్నలు పొలంబాటకు పయనమయ్యారు. దుక్కులు దున్నేందుకు అదునుగా వర్షాలు కురుస్తుండడంతో వేరుశనగ వేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. మరోపక్క ఎన్నికల హడావిడి చల్లారడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి కూలీలకూ పనులు దొరికాయి.పంట సాగుకు సన్నద్ధమైన రైతులు మండల పరిధిలో గత ఖరీఫ్‌ సీజన్లో సకాలంలో వర్షాలు సక్రంగా కురకపోవడంతో అత్యల్పంగా రైతులు వేరుశనగ సాగుచేశారు. దానిని అధిగమించేందుకు ఈ సంవత్సరం వ్యవసాయశాఖ వారు ఆర్‌బికెల ద్వారా రైతులకు పలు సూచనలు సలహాలను ముందస్తుగా అందజేశారు. దుక్కులను దున్నడం, ఎరువులు వాడకం, విత్తన శుద్ధి తదితరాల గురించి అవగాహన కల్పించారు. ఈనెల 23 నుండి ఆర్బికేల ద్వారా మండల పరిధిలోని 18 గ్రామపంచాయతీలో సబ్సిడీపై వేరుశనగ విత్తనకాయలను అందజేస్తున్నారు. అదునకు ముందుగా సకాలంలో వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ విత్తన కాయలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా తమ పొలాల్లో వేరుశనగను సాగు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో అంతర పంటల సాగు పై రైతులకు అవగాహన కల్పించారు. నైరుతి రుతుపవనాలు రాను నేపథ్యంలో మండల పరిధిలో సాగులో ఉన్న వరి పంటల నూర్పిడలను త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేశారు.తీరనున్న కూలీల సమస్య.. మండలంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియడంతో కూలీల సమస్య తీరనున్నట్లు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సాగువిస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు కూలీల అవసరాలు పెరగనున్నాయి. టమోటా పంటకు సీజన్‌ కొనసాగుతుండడంతో కూలీల అవసరాలు మరింత పెరగనుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు వేగంగా పెరగడంతో కూలీలకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. వ్యవసాయశాఖ వారు నిర్దేశించికున్న లక్ష్యాల మేరకు వేరుశనగ పంట సాగుకు రైతును సన్నద్ధం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం పై దీని ప్రభావం పడే పరిస్థితి నెలకొంది.ఎన్నికల కోడ్‌.. ఆగిన రైతు భరోసా గత సంవత్సరం రబీలో ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కొనుగోలుకు రైతు ఖాతాలో నగదు జమ చేసింది. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌కు ఎన్నికల కోడ్‌ అడ్డు రావడంతో రైతు భరోసా ఆగిపోవడంతో వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసినందుకు రైతులు డబ్బుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలలో పాలకుల తీరుకు ప్రజలు అలవాటు పడితే వ్యవస్థలో మార్పులు సంభవించినప్పుడు ఇటువంటి అవస్థలు తప్పవని ప్రజలు చర్చించుకుంటున్నారు.రైతులు సమాయత్తం కావాలి – రాజ్యలక్ష్మి, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు వర్షాలు మొదలు కావడంతో రైతులు వేరుశనగ సాగుకు దుక్కులుదున్ని పొలాలను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్‌బికే సిబ్బంది క్షేత్రస్థాయిలో సాగును పరిశీలించి పంటను తప్పనిసరిగా నమోదుచేయాలి. వేరుశనగలో రైతులు విత్తనశుద్ధిని తప్పనిసరిగా పాటించి అంతర పంటల సాగుపై మొగ్గు చూపి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

➡️