ప్రజాశక్తి-కుప్పం టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణమూర్తి తెలిపారు. నిరుద్యోగ నిర్మూలన ధ్యేయంగా నిర్వహించిన జాబ్ వేళాలో 142మంది నిరుద్యోగులు హాజరు కాగా అందులో 31మంది ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు తెలిపారు. మీరందరికి నియామక పత్రాలను అందజేశామన్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వహించిన అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజ్యలక్ష్మిని, వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్‌ను, నియామకాలు నిర్వహించిన పరిశ్రమ ప్రతినిధులను కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.