పుంగనూరు జోనల్ గేమ్స్ లో సోమల విద్యార్థుల ప్రతిభ 

Dec 11,2024 10:57 #Chittoor District

ప్రజాశక్తి – సోమల: చిత్తూరు జిల్లా పుంగనూరు జోనల్ గేమ్స్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమల విద్యార్థులు త్రో బాల్ గేమ్ లో ప్రతిభ కనబరిచి పుంగనూరు జోన్ లో ద్వితీయ స్థానం సాధించారు. ఈనెల తొమ్మిద వ తేది సోమల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందూరు యందు పుంగనూరు జోన్ పాఠశాలల బాలుర త్రో బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పుంగనూరు జోన్ పరిధిలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు .హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమల విద్యార్థులు ప్రతిభ కనబరిచి త్రో బాల్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పీడీ కరుణానిధి తెలిపారు. ఈ విజయం పట్ల ప్రధానోపాధ్యాయులు హరినాథ్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి క్రీడాకారుల్ని అభినందించారు.

➡️