యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాల పూర్తి చేయాలి : కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ (చిత్తూరు) రాష్ట్ర ప్రభుత్వం గహ నిర్మాణాల పురోగతి పై ప్రత్యేక దష్టి సారించిందని, రానున్న మూడు నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన ఇంటి నిర్మాణాలు చేపట్టి పురోగతి సాధించాలని హౌసింగ్, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం హౌసింగ్ డిమాండ్ సర్వే, గహనిర్మాణ పురోగతిపై హౌసింగ్ పిడి, మున్సిపల్ కమిషనర్, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ పిడి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలో ఇంటి నిర్మాణాలు చేపట్టి అసంపూర్తిగా ఉన్న గహాల లబ్ధిదారులను గుర్తించి గహ నిర్మాణాల పురోగతి పై దష్టి పెట్టాలన్నారు. ఈనెల 5న చిత్తూరు, నగరి నియోజక వర్గాలు, 6న పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హౌసింగ్‌కు సంబంధించి డిమాండ్ సర్వేను పూర్తి చేయాలని, నరేగా కింద తీసుకుంటున్న చర్యలతో పాటు క్షేత్రస్థాయిలో ఇంటి నిర్మాణం చేపడుతున్న వారి వివరాలను, గహ నిర్మాణాలను పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు, వాటిని పూర్తి చేయడానికి అవసరమైన బ్యాంక్ రుణాల వివరాలతో సమీక్షకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, హౌసింగ్ అధికారులు హాజరు కావలసి ఉంటుందన్నారు. సచివాలయాల స్థాయిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారులను గుర్తించి గహ నిర్మాణాలను పూర్తి చేసే చర్యలు చేపట్టాలన్నారు. గహనిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులకు ఇంటి పట్టాలు రద్దు పరచాలని, నిర్మాణం చేపట్టి వివిధ దశలలో ఉన్న గహాలకు సంబంధించి లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. గహ నిర్మాణాలకు అవసరమైన మెటీరీయల్‌ను సకాలంలో అందించి ఇంటి నిర్మాణాలకు తోడ్పాటు అందించాలన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని, ఇంటి వద్ద లబ్ధిదారులు అందుబాటులో లేనిపక్షంలో సచివాలయాల వారీగా ప్రభుత్వ అధికారుల ద్వారా వారిని గుర్తించి పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలన్నారు. అలాగే జిఎస్‌డబ్ల్యూఎస్ ద్వారా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలకు సంబంధించి జరుగుతున్న సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఇంకనూ ఈ సర్వేలో నమోదు కాని వారి వివరాలను ఫిబ్రవరి 5వ తేదీ లోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇంటి నిర్మాణాలను మొదలుపెట్టని లబ్ధిదారుల వివరాలను సచివాలయాల వారీగా సేకరించి మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలతో కారణాలను విశ్లేషించి పురోగతికి చర్యలు చేపడుతున్నామని, ఇంటి నిర్మాణాలకు ధరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని, ఈనెల 7వ తేదీ లోపు డిపిఆర్‌లను ప్రభుత్వానికి పంపవలసి ఉంటుందని హౌసింగ్ పిడి కలెక్టర్‌కు వివరించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరీయల్స్ అందించడం జరుగుతున్నదని, నూతనంగా గహనిర్మాణాలు చేపడుతున్న వారికి కూడా సిమెంట్, స్టీల్ వంటి మెటీరీయల్స్‌ను అందించడం జరుగుతుందని కలెక్టర్‌కి హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ వివరించారు.
