సిపిఎం పోరాటంతో కదిలిన అధికార యంత్రాంగం

Feb 5,2025 12:29 #Chittoor District, #CPM demands

మొగిలి యానాధులకు ఇళ్ల స్థలాలు, గురుకుల పాఠశాలకు స్థలాలు డిఆర్ఓ పరిశీలన

ప్రజాశక్తి-బంగారుపాళ్యెం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యెం మండలం మొగిలి యానాదుల కు ఇళ్ళ స్థలాలు, గురుకుల పాఠశాల తదితరు మౌలిక సదుపాయాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన ఫలితంగా బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి మరియు తాసిల్దారు మొగిలి ఊరగుట్ట స్థలాలు పరిశీలన చేయడం జరిగింది. ఈ పర్యటనలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఊరగుట్ట స్థలాన్ని యానాదులు గొర్రెలు, మేకలు, పశువులు మేపుకుంటూ తమ అనుభవములో ఉందని తెలిపారు. అయితే కొంతమంది ఈ స్థలాలపై కన్నుపడి అగ్రకులస్తులు భూకబ్జాకు పాల్పడ్డారు. దీనిపై యానాదులను ఐక్యం చేసి సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టగా కలెక్టర్ స్పందించి గతంలో డిప్యూటీ కలెక్టర్ భవాని ఆధ్వర్యంలో సర్వే చేయించగా 59 ఎకరాల ప్రభుత్వ భూమి వుందని తేల్చాను. ఆ స్థలంలో 12 మంది అగ్రకులాల ఆక్రమించుకొని మామిడి చెట్లు పెట్టారని రెవెన్యూ అధికారులు గతంలో దొంగ పట్టాలు ఇచ్చారు. స్మశానాన్ని కూడా ఆక్రమించడంతో ఆందోళన చేయగా రెవెన్యూ అధికారులు స్పందించి 67 సెంట్లు కేటాయించారు. మరోసారి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా డిఆర్వోను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం డిఆర్ఓ ఊరగుట్టను సందర్శించి పరిశీలించారు. తాసిల్దార్ ఊరగుట్ట ప్రాంతంలో గురుకుల పాఠశాలకు 5 ఎకరాలు కేటాయించినట్లు అదేవిధంగా ఇళ్ల స్థలాల కొంతమంది అర్హులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు . అలాగే రోడ్డు ఇతర సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సదుపాయాలు కల్పించి ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ స్పందించి పరిశీలించడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంఘం కార్యదర్శి నిర్మల, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శంకరన్, స్థానికులు మంజునాథ్ యానాదులు పాల్గొన్నారు.

➡️