సీసీ కెమెరాల వైర్లు కత్తిరించిన దుండగులు

Mar 1,2024 12:12 #Chittoor District
The criminals who cut the wires of the CCTV cameras

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై
ప్రజాశక్తి-వెదురుకుప్పం/ కార్వేటినగరం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో కార్వేటినగరం మండలం లో రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి. ఇందులో మొత్తం 442 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడ అన్ని రూములకు సీసీ కెమెరాలను గతంలో యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. సంబంధిత విషయమై అక్కడ విధులు నిర్వహిస్తున్న చీఫ్ స్వరూప కార్వేటినగరం ఎస్సై ఆవుల వెంకట కృష్ణకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘ స్థలానికి చేరుకుని పరిశీలించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరాగం కాకుండా చూసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలియజేశారు.

➡️