ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు): తిరుపతి విషాద ఘటనకు పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిదే గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ….. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఘటన జరిగి అరగంట ఆలస్యంగా అంబులెన్స్ వచ్చిందని అన్నారు. గతంలో ఎన్నడు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న దాఖలు లేవన్నారు. ఇకనైనా తీరు మార్చుకుంటారా…. లేక ఇదేవిధంగా భక్తులు ప్రాణాలతో చెలగాటం మారతారా అని ప్రశ్నించారు. గాయపడ్డ భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని, మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి నష్ట పరిహారంతో పాటు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిటిడిలో ఉద్యోగం కల్పించాలని తెలిపారు. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గోదావరి పుష్కరాలు ఘటన, నేడు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకి తిరుపతి శ్రీవారి భక్తులు 6 గురు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కుటమి ప్రభుత్వం ఏర్పడి నాప్పుడు నుంచి భక్తులపై అశ్రద్ధ వహించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం కాదన్నారు. ఇన్ని ఘటనలు జరిగిన ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్నారు. తిరుపతి ఘటనపై ఉన్నత స్థాయి సంస్థలతో దర్యాప్తు చేపించాలని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ కృపా లక్ష్మి డిమాండ్ చేశారు.