‘ఆ’ శ్మశానంలో అడుగుపెడితే రంగు పడుద్ది..

Apr 13,2025 13:05 #Burial Grounds, #Chittoor District

‘ఆ నలుగురికి’ గాయాలు..!?
ముళ్ల  శ్మశానంలో సమస్యలు
పొదలు తొలగించలేక అవస్థలు

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఒక మనిషి చనిపోతే అతను శాశ్వత నిద్రలో ఉన్నాడు. కుటుంబీకులు బంధు తమ బాధను అలా వ్యక్తం చేస్తారు. చనిపోయిన వ్యక్తిని భూమిలో పాతిపెట్టాలంటే స్మశానంలో ఒక యుద్ధమే చేయాల్సిన అంత పని అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. కమ్ముకుంటున్నముళ్ల పొదలను తొలగించలేక కాళ్లకు ముండ్లు గుచ్చుకొని అవస్థల పడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆ గ్రామస్తులు చెప్పిన మాటలు ఒకసారి వింద్దాం…

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో కొమరగుంట గ్రామం ఉంది. ఇక్కడ సుమారుగా 150 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామానికి రోడ్డుకు ఆనుకొని సుమారుగా ఒక ఎకర శ్మశానం స్థలం ఉంది. గత ప్రభుత్వం ఎవరైనా చనిపోతే ఖననం చేసేటందుకు స్మశాన వాటిక, బంధువులు బట్టలు మార్చుకునేటందుకు స్త్రీ పురుషులకు విడివిడిగా గదులు నిర్మించారు. ఆ గ్రామంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఇక్కడ ఖననం చేయాలంటే బంధువులకు ఇబ్బందులు. ఆ ముళ్ళు పొదలను తొలగించలేక నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతిదేహాన్ని మోసుకువస్తున్న ఆ నలుగురికి కాళ్లకు ముళ్ళు గాయాలు తప్పవని చెబుతున్నారు. పాతిపెట్టేటందుకు గొయ్యి తీయాలన్నా పెద్ద పెద్ద మొక్కలు పెరిగిపోయి ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. స్త్రీ, పురుషులకు విడివిడిగా నిర్మించిన గదులు చుట్టూ ముండ్లపొదలో కమ్ముకొని లోపల ఏమి ఉన్నాయి కనిపించకుండా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఇంత అద్వానంగా ఉన్న శ్మశానం వాటికను ప్రభుత్వం స్పందించి గ్రామస్తులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు.

➡️