అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి..మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి పరిష్కరించకపోతే మార్చి 10న చలో విజయవాడప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రవ్యాప్త ధర్నాలో భాగంగా సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, జిల్లా కార్యదర్శి షకీలా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సమస్యలపై 42 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాట సందర్భంలో జులైలో వేతనాలు పెంచుతామన్నారని, మరో 11 డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా ముఖ్యమంత్రిని, పలువురు మంత్రులకు విన్నవించుకున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని మండిపడ్డారు. సుప్రీం కోర్టు అంగన్వాడీలు గ్రాట్యూటీకి అర్హులని 2022లో తీర్పు ఇచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాలలో దాదాపుగా 5600 మినీ సెంటర్లు ఉన్నాయని, మినీ వర్కర్లకు తక్కువ వేతనం ఇస్తూ ఎక్కువ పనిభారాలు వేస్తున్నారని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వ సర్వేలు నివేదికలు అందిస్తున్నా ప్రభుత్వం మాత్రం జీవోను విడుదల చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్న ప్రభుత్వం అంగన్వాడీలకు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. కావున పెండింగ్లో ఉన్న సెంటర్ బిల్లులు, టిఏ బిల్లులు, కావెంట్, ఈవెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే రానున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ సమస్యలపై చర్చించాలని, వారికి జీతాలు పెంచాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవోలు విడుదల చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం ఆపాలని డిమాండ్ చేశారు. ధర్నాలో అంగన్వాడీ జిల్లా నాయకులు సుజిని, మమత, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.బంగారుపాళ్యం: అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సోమవారం మండల కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో నిరసన తెలిపారు. అనంతరం అంగన్వాడీలు లక్ష్మీ, రాధిక, రత్న కూమారి, విమల, భారతిలు సిడిపిఓ వాణి శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో ఉండాలని జీవో విడుదల చేయాలని, వేతనం కూడిన మెడికల్ లీవ్‌లు మూడు నెలలకు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రకళ, హారిక, హేమ, విజయ కుమారి, నాగరాజమ్మ, మమత, లక్ష్మీ ప్రసన్న, స్వర్ణ పాల్గొన్నారు.కార్వేటినగరం: అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు వేతనాలు పెంచి, గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు విజయ, మమత డిమాండ్ చేశారు. సోమవారం మండల కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో చంద్రమౌళికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ పెరుగు నిత్యావసర వస్తువుల ధరలను దష్టిలో ఉంచుకుని కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, సర్వీసులో ఉండి మతి చెందిన వారికి దహన సంస్కారాలకు రూ.20 వేలు అందించాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులూ వెంటనే ఇవ్వాలని, అన్ని యాప్పులు కలిపి ఒకే యాప్ మార్పు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం.పలమనేరు: స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీల జీతాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు మంజుల, కవిత, కష్ణవేణి, శుభలక్ష్మి, శుభమ్మ, సుమలమ్మా, సుజనా, చంద్రమ్మ పాల్గొన్నారు.శాంతిపురం: తాము అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం శాంతిపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని శాంతిపురం, రామకుప్పం మండలాల అంగన్వాడీ వర్కర్లు మండల సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిడిపిఓ కల్పనకు వినతి పత్రాన్ని అందజేశారు. యూనియన్ నాయకులు శోభ, శైలజ, ఎర్రమ్మ, గీతాంజలి, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు.బైరెడ్డిపల్లి : బైరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీలు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ సోమవారం సిడిపిఓకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.25వేలు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, మెడికల్ లీవ్ వేతనంతో మూడు నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్యామల, భువనేశ్వరి, అంగన్వాడీలు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి..మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి పరిష్కరించకపోతే మార్చి 10న చలో విజయవాడ
