ఖైదీల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి సబ్ జైల్ తనిఖీ చేసిన ఎస్పీ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ చిత్తూరు జిల్లా సబ్ ను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు శనివారం తనిఖీ చేశారు. జిల్లా జైలు భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జైలు సిబ్బంది, అధికారులతో సబ్ జైలు భద్రత, ఖైదీల హక్కులు, జైలు సిబ్బంది పనితీరు, ఆర్థిక, భద్రతా అంశాలపై సమీక్షించారు. జైలు వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగమని, ఖైదీల భద్రతకు సంబంధించి ప్రభుత్వం, పోలీస్‌శాఖ, జైలు సిబ్బంది ఎంతటి కట్టుబాటు ఉందో వివరించారు. ఖైదీలకు సురక్షితమైన, నైతిక పరిరక్షణను కల్పించడంలో జైలు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జైలులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, గార్డులు చేపడుతున్న పర్యవేక్షణ, రాత్రి వేళల రక్షణా చర్యలపై విస్తృతంగా చర్చించారు. జైలులో గార్డులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత శ్రద్ధ చూపి, జైలు వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు మార్గదర్శకాలు అందించారు. ఖైదీల మనోభావాలు, వారి సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, జైలర్లు శంకర రావు, అప్పలనారాయణ, కుమారస్వామి సిబ్బంది పాల్గొన్నారు.