జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Nov 28,2024 22:33
జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌ కుమార్‌ తెలిపారు. గురువారం జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్‌ హాల్‌లో పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాష, సిపిఓ సాంబశివా రెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ కులశేఖర్‌, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పిసిఆర్‌ సర్కిల్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి నాయకులు కె.మణి, బి.కుమారి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, నగర కార్యదర్శి విసి.గోపీనాథ్‌, మాజీ సైనిక ఉద్యోగి ఎస్‌.వెంకట రమణ పాల్గొన్నారు. రొంపిచర్ల: రొంపిచర్ల మండల కేంద్రం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మహాత్మ జ్యోతిరావు పూలే 134 వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభివద్ధికి, అంటరానితనం కులవ్యవస్థ నిర్మూలన కొరకు ఎంతో కషి చేశారని పేర్కొన్నారు. బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు. పలమనేరు: గురువారం టవర్‌ క్లాక్‌ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు బీసీ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌వి.రమణారెడ్డి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గిరిధర్‌ గుప్తా, టిడిపి బలరాం, రమణమూర్తి, గోవిందస్వామి, త్యాగరాజులు, వెంకటరమణ, నంజుండప్ప పాల్గొన్నారు. కుప్పం టౌన్‌ : కుప్పం పురపాలక సంఘ సామగుట్టపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్థంతి సందర్భంగా పాఠశాల సిబ్బంది ఫూలే చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, పూలతో ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీనదయాళ్‌, తెలుగు ఉపాధ్యాయుడు గాలి సురేష్‌, సౌజన్య, గాయత్రీదేవి, శాంత, విజయనిర్మల, సరస్వతి పాల్గొన్నారు.

➡️