డబ్బులిస్తాం.. మీ ఓటు మాకే..ఉద్యోగులకు వైసిపి హుకుం నగదును గోశాలకు ఇచ్చిన ఉద్యోగులు

డబ్బులిస్తాం.. మీ ఓటు మాకే..ఉద్యోగులకు వైసిపి హుకుం నగదును గోశాలకు ఇచ్చిన ఉద్యోగులుప్రజాశక్తి- పుంగనూరు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక్కో పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.3వేలు ఇచ్చి వైఎస్సార్‌సీపీకే ఓటు వేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఉద్యోగులకు హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.. ఉద్యోగులు ఎవరైనా డబ్బులు తీసుకోకుండా నిరాకరికస్తే.. అంటే మీరు వైసిపికి ఓటు వేయరా అంటూ బెదిరింపు ధోరణితో ప్రశ్నించారట..! ఉద్యోగులు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి చేసింది ఏమీ లేదని, వస్తున్న జీతాల్లోనూ కోతలు విధించి ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేశారని వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు.. గత ఎన్నికల సమయంలో వైసిపి విడుదల చేసిన మేనిఫెస్టోలో సిపిఎస్‌ రద్దు చేస్తామన్నారు.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎన్ని ఉద్యమాలు చేశారు. దీంతో వారు తమ సమస్యలు పరిష్కరించకపోగా ఉద్యమాన్ని రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందని ఈ వ్యతిరేకత మొత్తం 2024 సార్వత్రిక ఎన్నికల్లో వ్యతిరేక ఓటు పడుతుందని వైసిపి నిర్ణయించుకుంది. అయితే పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం అలా కాకూడదని వైసీపీ పెద్దలు ఉపాధ్యాయ, ఉద్యోగుల ఓట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏదో ఒక రకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లులో వైసీపీకే వేయించాలని డబ్బులు వెదజల్లారు. నియోజకవర్గంలో ఓ పార్టీనేతతో 40 ప్రభుత్వ ఉద్యోగులు కూటమికి ఓటేస్తామని చెప్పారు. వారు కూడా ఉద్యోగస్తులకు మేము మీకు అండగా ఉంటాం అంటూ భరోసా ఇచ్చారు. అయితే ఉద్యోగులు కూటమి అభ్యర్థుల నుంచి ఎలాంటి సహాయం ఆశించకుండా ఓటు వేస్తామని కరాకండిగా చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నిక రోజు వైసీపీ నాయకులు ఉపాధ్యాయులకు ఓటుకు రూ.3వేలు ఇస్తున్నాం తీసుకెళ్లండి అని చెప్పారు. అయితే ఓటుకు తమకు డబ్బులు అవసరం లేదని వారు చెప్పడంతో అయితే మీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వైసీపీకి వేయరా…, మీరు వైసీపీకి ఓటు వేస్తుంటే మా వద్దకు వచ్చే డబ్బులు తీసుకెళ్లండి అని హుకుం జారీ చేశారు. ఉపాధ్యాయులు చేసేది లేక 40 పోస్టల్‌ బ్యాలెట్‌లకు సంబంధించి 1లక్ష 20వేలు వైసిపి దగ్గర నుంచి తీసుకొచ్చారు. కానీ వైసీపీ నుంచి తెచ్చుకున్న డబ్బులు వారు సొంతానికి వాడుకోవడానికి గోశాలకు అందజేశారు. ఈ విషయం ఎన్నికల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

➡️