ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్: యువ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండడంతోపాటు వారిలోని ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు, దేశభక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని చిత్తూరు నగర మేయర్ అముద అన్నారు. యువతరం సానుకూల దక్పథంతో ఈ పోటీ ప్రపంచంలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ,నెహ్రూ యువ కేంద్ర, చిత్తూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ యువ ఉత్సవ్‌లో వచ్చిన అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉరకలెత్తే ఉత్సాహం చూపించే యువతను చూస్తే తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు.