జాతీయస్థాయి యోగా పోటీలకు చోడవరం విద్యార్థి ఎంపిక

ప్రజాశక్తి-చోడవరం (అనకాపల్లి) : చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం విద్యార్థి కొట్టపు హరికిరణ్‌ జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు కేంద్ర నిర్వాహకులు పుల్లేటి సతీష్‌ తెలిపారు. ఈనెల మార్చి 29, 30, 31 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌ లో నేషనల్‌ యోగాసన స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరగబోయే నాలుగవ జాతీయ స్థాయి యోగా పోటీల్లో హరి కిరణ్‌ పాల్గొన్నారని తెలిపారు. హరికిరణ్‌కు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం అధ్యక్షులు పసుమర్తి శేష అశోక్‌, తవ్వ మురళి, ఎస్‌ ఎస్‌ షాపింగ్‌ మాల్‌ వసుమర్తి గుప్తా, రెడ్డి అప్పారావు, యోగా టీచర్‌ బగవిళ్లి గణేష్‌ 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ యోగ క్రీడాకారుడిని డాక్టర్‌ బంగారు కృష్ణ, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్‌ జెర్రిపోతుల రమణా, జీ.ఓరుగంటి రాంబాబు, బోగవిల్లి రవితేజ, పతంజలి యోగ శిక్షణ కేంద్ర సభ్యులు, చోడవరం పట్టణ ప్రముఖులు పలువురు అభినందించారు.

➡️