ప్రజాశక్తి-మార్కాపురం: ఆవేశంతో నష్టాలే జరుగుతాయని, అందరూ శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.బాలాజీ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మార్కాపురం సబ్ జైలులో మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జడ్జి బాలాజీ మాట్లాడుతూ నేరాలకు పాల్పడితే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. ప్యానల్ న్యాయవాది కడియం రామయ్య మాట్లాడుతూ న్యాయవాదిని పెట్టుకోలేని వారికి న్యాయ సేవా అధికార సంస్థలకు అర్జీ పెడితే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తారన్నారు.