భద్రతా నియమాలపై అవగాహన ఉండాలి : సీఐ విద్యాసాగర్

Oct 7,2024 18:34 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : ప్రతిఒక్కరు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్ అన్నారు. ఆయన నేతృత్వంలో స్థానిక ఎస్సై ఎం.అశోక్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని జొన్నాడ సెంటర్ వద్ద వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రత పట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌరులందరూ రోడ్డు భద్రతా నియమాలకు కట్టుబడినప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తాడి శ్రీనివాస్ రెడ్డి (బట్టి శ్రీను), గొడవర్తి దుర్గాప్రసాద్ (బాబి), పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️