సామాజిక సేవల్లోనూ సిఐటియు

Jun 16,2024 23:08 #సిఐటియు
సిఐటియు

4న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం

ప్రజాశక్తి- సీతమ్మధార : కార్మికుల సమస్యలు, హక్కులపై పోరాటంలోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సిఐటియు ముందువరుసలో ఉంటుందని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ అన్నారు. వచ్చేనెల 4న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం చిట్టిబాబు కాలనీ కమ్యూనిటీ హాల్‌లో సిఐటియు అక్కయ్య్యపాలెం జోన్‌ కమిటీ సమావేశం కెఎస్‌. కుమార్‌ అధ్యక్షతన జరిగింది వివిధ రంగాల నుండి 22 మంది ప్రతినిధులు హాజరైన సమావేశంలో ముందుగా అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు వై.తులసి, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజు లోవ మృతికి సంతాపం తెలిపి, నివాళులర్పించారు. అనంతరం అక్కయ్యపాలెం జోన్‌ పరిధిలో చేపట్టిన పోరాటాలు, ఎన్నికల సమయంలో చేసిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై కార్యదర్శి ఎన్‌ ప్రకాశరావు వివరించారు. ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి. కుమార్‌, కార్మికుల సంక్షేమానికి సిఐటియు చేస్తున్న కృషి, పోరాటాలను వివరించారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో ఎక్కువమందిని యూనియన్‌లో సభ్యులుగా చేర్పించాలని సూచించారు. అక్కయ్యపాలెం జోన్‌ కమిటీ నూతన కార్యవర్గంఅనంతరం సిఐటియు అక్కయ్యపాలెం జోన్‌ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షునిగా. కె స్వతంత్ర కుమార్‌, ఉపాధ్యక్షునిగా వి బాబ్జీరావు, గౌరీశ్‌, నీలకంఠం. కార్యదర్శిగా ఎన్‌ ప్రకాశరావు, సహాయ కార్యదర్శులుగా. యుఎస్‌ఎన్‌ రాజు, జి.అప్పలరాజు,శంకర్‌, బి లక్ష్మి నారాయణ, కోశాధికారిగా బి. లక్ష్మీపతిలను ఎన్నుకున్నారుఉ. సమావేశంలో సిహెచ్‌. త్రినాధరావు, గౌరీశ్‌, యుఎస్‌ఎన్‌ రాజు, జి.అప్పలరాజు పాల్గొన్నారు.

➡️