మన్యం : కాంట్రాక్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ … సోమవారం మన్యంలో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వివిధ ప్రభత్వ శాఖలు, పథకాలు, సంస్థలలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్స్ టైంస్కేల్, కంటింజెంట్, పార్ట్ టైమ్, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతన తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు ప రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని, పర్మినెంట్ చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి జెసికి వినతిపత్రం అందించారు.