కొండపల్లి (ఎన్‌టిఆర్) : కొండపల్లి ఎ.పి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు … రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెకాలపు హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరాహార దీక్ష నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి యం.మహేష్ మాట్లాడుతూ …. గత ఏడాది డిసెంబర్ 26 నుంచి జనవరి 12 వరకు 17 రోజులు సమ్మె చేయటం ద్వారా అప్పటి ప్రభుత్వం 6 వేలు హెల్త్ ఇన్సూరెన్స్ ను జీతం తో కలిపి ఇచ్చారని, మిగిలిన హామీలు అమలు చేయాలని కూటమి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల సహఅదయంతో స్పందించి సమ్మె కాలపు హామీలు అమలు కు ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం 24 వేలు జీతాలు తక్షణమే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75 వేలు, సహాజ మరణం కు 2 లక్షలు, మట్టి ఖర్చులు 25 వేలు , యాక్సిడెంట్స్ డెత్ కీ 7 లక్షలు ఇవ్వాలని, డ్యూటీ లో గాయాలు అయినా కార్మికులను అందుకోవాలని, రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానం లో వారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, యూనిఫాం 2 జతలు, గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5 తారీఖు లోపు మున్సిపల్ వర్కర్స్ జీతాలు చెల్లించాలని, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో కార్మికులకు జీతాలు అధికంగా కోత విధిస్తున్నారని దీనిపై దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల శాశ్వత ప్రాతిపదికన పర్మినెంట్ చేయాలని, పెరిగిన కొండపల్లి ఇబ్రహీంపట్నం పట్టణ జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ లో ఆఫీస్ ఉద్యోగులను తక్షణమే నియమించి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల పై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ప్రెసిడెంట్ బి అప్పారావు సెక్రటరీ జి సురేష్ ఉపాధ్యక్షులు దేవుళ్ళు,శ్రీను, కోశాధికారి కఅష్ణ,కమిటీ సభ్యులు సింహాచలం, డుమ్ముకు రాజులు, లక్ష్మణరావు,నాగు, నవీన్,అంకరాజు, రాజు, నాగమణి, నూకరత్నం, అప్పలమ్మ, నాగలక్ష్మి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.