వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి : సిఐటియు

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్‌ : వాలంటీర్ల అందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన 10000 రూపాయల వేతనం హామీని నిలబెట్టుకోవాలి మంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం డిఆర్‌ఓ రాము నాయక్‌ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. ఎసురత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్‌ , బాల వెంకట్‌, సిఐటియు జిల్లా నాయకులు మధు శేఖర్‌ లతోపాటు వాలంటీర్లు సుధాకర్‌ ,భాగ్యలక్ష్మి స్వరాజ్యలక్ష్మి , లతోపాటు మరో 30 మంది వాలంటీర్లు నిరసనలో పాల్గనడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు వి ఏసురత్నం సిఐటియు జిల్లా కార్యదర్శిలు డి లక్ష్మణ్‌ వెన్న బాల వెంకట్‌ లు మాట్లాడుతూ గ్రామ, వార్డువాలంటీర్స్‌ ఉపాధిని కాపాడాలని కోరారు. బకాయివేతనాలు చెల్లించాలని, 10వేల వేతనహామీ నెరవేర్చాలని, వాలంటీర్ల విధివిధానాలు ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని,వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిగ్రీ చదివిన వారు కూడా వాలంటీర్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారని కేవలం 5 వేలగౌరవ వేతనానికి 5 ఏళ్ళుగా పనిచెయ్యడానికి లక్షలాది మంది సిద్ధపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏస్థాయిలో ఉందో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లకు వేతనాలు పెంచకుండా పెంచుతామనే భ్రమలలోనే చాకిరీ చేయించిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు 10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చినహామీ నెరవేర్చాలని, బకాయివేతనాలు చెల్లించి వాలంటీర్స్‌ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.గత ప్రభుత్వం వాలంటీర్స్‌ కు ప్రశంసలు, అవార్డులు, రివార్డులే తప్ప కనీస వేతనాలు, పనిగంటలు, పని భద్రత, విధివిధానాలు లేకుండా చాకిరీ చేయించింది. సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని అనేక సందర్భాలలో ప్రభుత్వాన్ని కోరిన పట్టించుకోలేదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్సార్సిపికి చెందిన స్థానికనాయకులు వాలంటీరీ మీద తీవ్రమైన ఒత్తిడి చేసి బలవంతంగా రాజీనామాలు చేయించారు. కొద్దిమంది ఇష్టపూర్వకంగా రాజీనామాలు చేసినప్పటికీ మెజారిటీ వాలంటీర్స్‌ భయంతో రాజకీయ ఒత్తిడిని భరించలేక రాజీనామాచేశారు, వాలంటీర్స్‌ ఆదాయంపైనే ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. వాలంటీర్స్‌ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని కోరారు.

➡️