ఆశా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సిఐటియు

చిత్తూరు (కలెక్టరేట్‌) : రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద భారీగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశలు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా నుద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు,ఆశ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంగా మాట్లాడుతూ ఆశాల లక్ష్యం నెరవేరకుండా అదనపు పనులు చేయించడం దారుణమన్నారు. మాతా, శిశు సంరక్షణ చేయాల్సిన ఆశలు ఇతర పనులన్నీ చేయిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం, గ్రాట్యూటి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశా కార్మికులకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చనిపోయిన వారికి చెల్లించాలి ఆశా కార్మికులకు పనిభారం తగ్గించాలి. ఈఎస్‌ఐ,పిఎఫ్‌ అమలు చేయాలి. అధికారుల చేస్తున్న వెట్టిచాకిరి వెంటనే మానుకోవాలి. రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలకు పొడిగించాలి. ప్రభుత్వ పథకాలు అన్నిట్లో అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆశాలకు వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం దారుణం అన్నారు. ఖాళీగా ఉన్న ఆశ పోస్టులను భర్తీ చేయాలి ప్రభుత్వం ఇప్పటికైనా ఆశల సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి అధ్యక్షత వహించగా నాయకులు, అనురాధ ఆ సుబ్బలక్ష్మి వనజాక్షి సావిత్రి సురేఖ ఖైదు పద్మ నలిని లతో పాటు ఆశాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️