ప్రజాశక్తి-కడప అర్బన్ : స్కీం వర్కర్ల, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్కీం వర్కర్లు, ఆనిమేటర్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను, అంగన్వాడీ, ఆశాలు, మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ధర్నాకు సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ … రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటును స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రమైన వేధింపులు, మనోవేదనకు, ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా స్థానిక నాయకుల వేధింపులు ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీలో పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రాలో పనిచేసే ఆనిమేటర్లు, ఆర్పీలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్న వంట మనుషులు, అంగన్వాడీలో ఆయాలు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లను, వాచ్మెన్లను రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చి వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా సిఐటియు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తుందన్నారు. జిల్లాలో 14 మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను, అంగన్వాడీలను, కడప, కమలాపురం, ముద్దనూరు, వేంపల్లి, చాపాడు ప్రాంతాల్లో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీదేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్, కాంటాక్ట్ అపుట్సోర్సింగ్, మున్సిపల్ కార్మికులు, తొలగించోద్దన్నారు. నగర కార్యదర్శి పి. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ … కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. మున్సిపల్ యూనియన్ కార్యదర్శి విజరు కుమార్ మాట్లాడుతూ అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఆర్. లక్ష్మీదేవి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటకనే జిల్లా వ్యాప్తంగా తొలగిస్తున్నారని తెలిపారు. టిడిపి నాయకుడు రాజీనామాలు చేయాలని హెచ్చరించారు. సమావేశంలో వేధింపులు గురైన బాధితులు అంగన్వాడీ కార్యకర్త , యానిమేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు వివిధ పథకాలలో పనిచేస్తున్న చిరుద్యోగులను పాల్పడిందన్నారు. చిరుద్యోగుల పైన వేధింపులు పాల్గొన్నారు. రాజకీయంగా వేధిస్తూ అక్రమంగా అవకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని అన్నారు ధర్నా అనంతరం జిల్లా స్పందనలో జిల్లా డిఆర్‌ఓ గారికి వినతిపత్రం ఇచ్చి జిల్లాలో పెడుతున్న రాజకీయ వేధింపులు అరికట్టాలని వారి కోరడమైనది విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దఅష్టికి వెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు కే సురేంద్ర కుమార్ వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ ధర్నా లో గోపి, తిరుపాల్, సుంకర రవి, కిరణ్ ప్రకాష్ ,అంజలీదేవి కుసుమావతి, ఉమా, ఆనంద్ కుమార్ , నాగరాజు కుమార్ పాల్గొన్నారు.
స్కీమ్ వర్కర్ల, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి : సిఐటియు
