ఏపీజిఎల్‌ బాండ్‌ సాధన సిఐటియు విజయం

May 16,2024 17:20 #ananthapuram

ప్రజాశక్తి- అనంతపురం కార్పొరేషన్‌ :అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పనిచేసే రెగ్యులర్‌ పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ జి ఎల్‌ బాండ్‌ సాధించటం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు సాధించిన ఘనవిజయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు నల్లప్ప ముత్తురాజులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో పోరాటాల ద్వారా రెగ్యులర్‌ ఉద్యోగస్తులకు ఏపీ.జి.ఎల్‌ బాండ్‌ సిఐటియు ఆధ్వర్యంలో సాధించుకోవడం జరిగినదని అన్నారు. 12 సంవత్సరాల క్రితం ఏ.పీ జి.యల్‌ బాండ్‌ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందన్నారు. (ఏ )బాండు మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగస్తులకు అందజేశారన్నారు. 8 సంవత్సరాలుగా రెగ్యులర్‌ ఉద్యోగస్తులకు సంబంధించి వారి జీతంలో మినహాయిస్తున్న ( బి,సి )రాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి కమిషనర్‌ తోను సంప్రదిస్తూ రెగ్యులర్‌ కార్మికులకు ఏపీ జి.ఎల్‌ బాండ్‌ లేక కార్మికులు నష్టపోతున్నారని తెలియజేయజేశామన్నారు. నూతన కమిషనర్‌ మేఘ స్వరూప్‌ కఅషివలన ఏ.పీ జి.ఎల్‌ బాండ్‌ సాధించుకున్నామన్నారు.

➡️