కర్లపాలెం : రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహశీల్దారు సుందరమ్మ తెలిపారు. మండల పరిధిలోని పాతనందయ పాలెం ఎస్‌టి కాలనీలో పౌర హక్కుల దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు సుందరమ్మ, ఎంపిడిఒ అద్దురి శ్రీనివాసరావు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ కేటాయించిన హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. కాలనీలోని కొన్ని గృహాలు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విఆర్‌ఒ శివ నాగరాజు, మహిళా పోలీస్ ఆనందకుమారి, హుస్సేన్, అట్ల సురేంద్రరెడ్డి, నరేష్ పాల్గొన్నారు.
