క్లాప్‌ ఆటో డ్రైవర్లు, మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ఆప్కాస్‌ రద్దు చేయొద్దు అంటూ, ప్రైవేట్‌ ఏజెన్సీలు వద్దు, మున్సిపల్‌ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని కోరుతూ బుధవారం ఏపీ మున్సిపల్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, క్లాప్‌ ఆటో డ్రైవర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఎంటిఎంసి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు ఎం రవి మాట్లాడుతూ …. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఆప్కాస్‌ ను తొలగించి, మున్సిపల్‌ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విషవాయువులను పీల్చుకుంటూ ,ప్రజల ఆరోగ్యం కోసం, పర్యావరణం ను కాపాడుతున్న మున్సిపల్‌ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే కార్మికులకు పని భద్రత ఉండదని, జీతాలు సక్రమంగా చెల్లించకుండా ఏజెన్సీలు కార్మికులను ఇబ్బందులు పెడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్కాసును తొలగించడం అనివార్యమైతే మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని రవి డిమాండ్‌ చేశారు. ఒక ప్రక్క మున్సిపల్‌ కార్మికులనుఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అని పొగుడుతూ ,వారు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటూ, శాలువాలు కప్పు తు మరో ప్రక్క వారు పోరాడి సాధించుకున్న హక్కులను కాల రాయాలని చూస్తే సిఐటియు చూస్తూ ఊరుకోదని రవి హెచ్చరించారు.తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలను మున్సిపల్‌ కార్యాలయంలోనికి రానివ్వకుండా పట్ట పగలుమున్సిపల్‌ కార్యాలయాల గేట్లకు అధికారులు తాళాలు వేయించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇటువంటి అప్రజా స్వామిక చర్యలను చైతన్యవంతమైన మంగళగిరి ప్రజలు అంగీకరించరని అన్నారు.కార్యాలయ గేట్లకు తాళాలు వేయించేందుకు సూపే శ్రద్ధ మున్సిపల్‌ కార్మికులకు రక్షణ పరికరాలు మాస్కులు, గ్లౌజులు, సబ్బులు, నూనెలు, చెప్పులు ,యూనిఫామ్‌ ఇచ్చే విషయంలో అధికారులు ఎందుకు చూపించడం లేదని రవి ప్రశ్నించారు.తక్షణం ఎం టి ఎంసీ అధికారులు మున్సిపల్‌ కార్మికులకు పెండింగ్‌ ఉన్న సబ్బులు, నూనెలు, మాస్కులు, గ్లౌజులు, చెప్పులు, యూనిఫామ్‌ ఇవ్వాలని రవి డిమాండ్‌ చేశారు. సిఐటియు నాయకులు వివి జవహర్‌ లాల్‌ మాట్లాడుతూ క్లాప్‌ ఆటో డ్రైవర్లు, మున్సిపల్‌ కార్మికుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరారు.క్లాప్‌ ఆటో డ్రైవర్లకు 16 నెలలుగా పెండింగ్‌ ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ వారి ఖాతాలలో జమ చేయాలని అన్నారు.కార్మికులకు ఇబ్బంది కలిగించాలని చూస్తే సిఐటియు అన్ని రంగాల నుండి కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని జవహర్‌ లాల్‌ హెచ్చరించారు.సిఐటియు నాయకులు బాలాజీ మాట్లాడుతూ కార్మికులు సంఘటితమై సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌ వేణు, సిఐటియు నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, పల్లె కఅష్ణ, వెంగమ్మ ,చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకఅష్ణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మంగయ్య, ఏసు, సుందర్రావు క్లాప్‌ ఆటో డ్రైవర్ల యూనియన్‌ నాయకులు రవి, శివ, శ్రీకాంత్‌ తదితరులు పాల్గన్నారు.

➡️