గుడి నిర్వహణ బాధ్యతలు – టిడిపి, జనసేన మధ్య ఘర్షణ

ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి గ్రామంలోని అపర్ణదేవి గుడి నిర్వహణ బాధ్యతల కోసం టిడిపి జనసేన నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం గుడి నిర్వహణ బాధ్యతలు తమకు కావాలంటే తమకు కావాలని ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు వాదులాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాటమాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు ఇరు వర్గాలను సద్దుమణిగేలా చేశారు.

➡️