జిల్లా కేంద్రానికి చేరిన పదోతరగతి ప్రశ్నాపత్రాలు

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా కేంద్రానికి పదవతరగతి ప్రశ్నాపత్రాలు సోమవారం చేరాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డి డిఈఓ బి.వరలక్ష్మి , ఏసి గోవింద నాయక్‌ దగ్గర ఉండి పోలీస్‌ బందోబస్తు నడుమ ప్రశ్న పత్రాల బండిల్స్‌ ని కెఎస్‌ఆర్‌ గర్ల్స్‌ హైస్కూలోని స్ట్రాంగ్‌ రూమ్‌ లో భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 ఓబులపతి, టి యు ఆఫీస్‌ పర్యవేక్షకులు సరల కుమారి, పరీక్షల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

➡️