ప్రజాశక్తి – కడప పరిసరాలను శుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చదనంతో నింపాలని, కార్యాలయాలను సొంత నివాసాల్లా అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవలన్న కలెక్టర్ శివశంకర్ లోతేటి మాటలను తూచా తప్పక పాటిస్తూ కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులు వారివారి బ్లాకుల వద్ద ‘స్వచ్ఛతాహి సేవా’ కార్యక్రమాన్ని గురువారం నిర్వ హించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని పరిసరాలన్నింటిని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్చందంగా పార, పలుగు పట్టి పిచ్చిమొక్కలను తొలగించారు. దీంతో కలెక్టరేట్ పరిసరాలు పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ ‘స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్, ప్రయివేటు సంస్థాగత రంగాలకు చెందిన ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా తమ పరిసరాలను శుభ్రపరచుకుంటున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పూర్తితో మన జిల్లాను కుడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దెందుకు జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ప్రాంగణాన్ని అది óకారులు, సిబ్బందితో శుభ్రంగా మార్చారన్నారు. ఇదే స్ఫూర్తితో నగర ప్రజలు స్వచ్చందంగా ఎవరి పరిసరాలు వారు శుభ్ర పరుచుకుంటే నగరంతో పాటు పట్టణాలు, పల్లెలు ఆరో గ్యకరంగా, ఆహ్లాద కరంగా, స్వచ్చంగా మారుతాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఆరోగ్యకరంగా తీర్చి దిద్దాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిపిఒ ప్రభాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఎఒ విజరు కుమార్, హౌసింగ్ పీడీి కష్ణయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఐఅండ ్‌పీఆర్ ఎడి పి.వేణుగోపాల్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.నగరపాలక సంస్థలో పరిసరాల శుభ్రత కడప అర్బన్ : నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు, నగరపాలక సంస్థలోని అధికారులు, ఉద్యోగులు ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో భాగంగా గురువారం వారి సెక్షన్ పరిసరాలను శుభ్రపరచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సెక్షన్‌లో ఉన్న వారు, వారి కార్యాలయ పరిసరాలను శుభ్రపరచాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన నగరం పరిశుభ్రంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పరిశుభ్రత మన ఆరోగ్యానికి, మన సమాజ అభివద్ధికి కీలకమైందని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రమించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని కోరారు. మన కషి మన కడపను ఒక శుభ్రమైన, హరిత నగరంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, రెవెన్యూ, ఎస్టాబ్లిష్మెంట్, హెల్త్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, నగరపాలక సిబ్బంది అందరూ తమ తమ సీట్లు, పరిసరాలను శుభ్రపరచి, వ్యర్థాలను తీసివేయడంలో చురుకుగా పాల్గొన్నారు. సిద్ధవటం: మన పనిచేసే ప్రాంతాలైన ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకుందామని తహశీల్దార్ మురాషావలి పేర్కొన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ పరిసరాలను స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచారు. కార్యాలయ ప్రాంగణంలోని ప్లాస్టిక్ చెత్తను, పిచ్చిమొక్కలు, ముళ్ల పొందలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలని, అప్పుడే వ్యాధులు మనదరికి చేరవని పేర్కొన్నారు. అలాగే మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ మాధవిలత, విఆర్‌ఒలు, ఇసిబ్బంది పాల్గొన్నారు.
