పరిసరాల శుభ్రత అందరి బాధ్యత

ప్రజాశక్తి – కడప : పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు శివరామకష్ణ, డాక్టర్‌ అంకాల నాగరాజు, లీల వర్ధిని అన్నారు. ప్రభుత్వ పురుషుల కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలో స్వచ్ఛతా హీసేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల బయట, కలెక్టరేట్‌ ఆవరణంలో ఉన్న కలుపు మొక్కలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. వాలం టీర్లంతా కలిసి కళాశాలలో స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేసినందుకు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి. రవీంద్రనాథ్‌ విద్యార్థులను అభి నంది ంచారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం రమేష్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు పి శివరామకష్ణ, డాక్టర్‌ అంకాల నాగరాజు లీల వర్ధిని పాల్గొన్నారు.

➡️