ఎయులో క్లీనికల్‌ ఎంబ్రియాలజీ కోర్సు

క్లీనికల్‌ ఎంబ్రియాలజీ

ప్రజాశక్తి- విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మశీ కళాశాలలో నూతనంగా నిర్వహిస్తున్న మాస్టర్స్‌ ఇన్‌ క్లీనికల్‌ ఎంబ్రియాలజీ కోర్సును వర్సిటీ విసి ఆచార్య జి.శశిభూషణరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సమాజంలో ఎంబ్రియాలజీ నిపుణుల అవసరం పెరుగుతోందన్నారు. సమాజ అవసరాలు, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇటువంటి కోర్సును ప్రారంభించడం పట్ల కళాశాల ఆచార్యులను విసి అభినందించారు.లైఫ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంటర్న్‌షిప్‌తో, ప్రత్యక్ష శిక్షణతో కూడిన ఈ కోర్సులను ఏయూ సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. ఏడాది కాల వ్యవధి కలిగిన పిజి డిప్లమా కోర్సును సైతం నిర్వహిస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య జి.గిరిజాశంకర్‌ మాట్లాడుతూ కళాశాల నుంచి తక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సమాజానికి అవసరమైన నిపుణులను అందించే విధంగా కోర్సు రూపకల్పన చేసి నిర్వహిస్తున్నామన్నారు.కార్యక్రమంలో అకడమిక్‌ డీన్‌ ఆచార్య కె.ఈశ్వర్‌కుమార్‌, మాజీ ప్రిన్సిపాల్‌ ఆచార్య వై.రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విసి ఆచార్య శశిభూషణరావు

➡️