పారిశుధ్య కార్మికులకు దుస్తులు

పంపిణీ ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి దుస్తులు, నిత్యావసర సరుకులు, పాదరక్షలు మంగళవారం పంపిణీ చేశారు. సర్పంచి తాటిపర్తి వనజ అధ్యక్షతన వార్డు సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచి మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరియు పరిశుభ్రతలో కార్మికుల పనితీరు గొప్పదని తెలిపారు. వారిని గౌరవించాల్సిన అవరసం ఉందన్నారు. కార్మికుల జీతాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నటుల తెలిపారు. ఈ పాటికే వార్డు సభ్యుల సహకారంతో తీర్మానం చేసినట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. జీతాల పెంపు విషయం గురించి అధికారులతో మాట్లాడి త్వరలో జీతాలు పెంచి విధంగా చూస్తామని తెలిపారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల జీతాల విషయం గురించి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు పడిదపు రవి కుమార్‌, మేకల నరేష్‌బాబు, ఓలేటి రవిశంకర్‌రెడ్డి, తన్నీరు తిరుపతమ్మ, షేక్‌ షాకీరా, షేక్‌.ముజీబ్‌, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.జగదీష్‌బాబు, జూనియర్‌ అసిస్టెంట్‌ జె.శ్రీనివాసులు, బిల్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, నక్కా మాల్యాద్రి, సతీష్‌, అశోక్‌, లక్ష్మణ్‌, ప్రణరు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️