సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

ప్రజాశక్తి-వేమూరు:  చుండూరు మండలంలోని చినగాదెలవర్రు గ్రామానికి చెందిన గండికోట రాజు, భట్టిప్రోలు మండలం గొరిగపూడి గ్రామానికి చెందిన వరికూటి లక్ష్మీ సుజాత, భట్టిప్రోలు గ్రామానికి చెందిన ఆత్మూరి భవాని, గేదల శ్రీనివాసరావులకు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వీరు చికిత్స కోసం అయిన బిల్లులను నక్కా ఆనంద బాబు వారి రిఫరెన్స్‌ లెటర్‌ ద్వారా సీఎం కార్యాలయానికి పంపారు. తదుపరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు రూపంలో గండికోట రాజుకు రూ.83,387, వరికూటి లక్ష్మీ సుజాతకు రూ.1,79,754, ఆత్మూరి భవానికి రూ.40,000, గేదల శ్రీనివాసరావు రూ.20,524 చొప్పున మొత్తం రూ.3,23,395 మంజూరు కాగా చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

➡️