ప్రజాశక్తి- రాజోలు: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు శుక్రవారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 36 మంది బాధిత కుటుంబాలకు రూ.34,60 లక్షల విలువగల చెక్కులు లబ్ధిదారులకు ఎంఎల్ఎ అందజేశారు. ఈ సందర్బంగా ఎంఎల్ఎ వరప్రసాద్ మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే దేవ వర్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎపి మార్క్ పేడ్ డైరక్టర్ జి.పెదకాపు,జనసేన రాష్ట్ర నాయుకులు గెడ్డం మహలక్ష్మీ ప్రసాద్,తాడి మోహన్, రాజోలు జనసేన మండల పార్టీ అద్యక్షులు సూరిశెట్టి శ్రీను, టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.