ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకివీడులో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనువుగా లేకపోవడంతో పర్యటనలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో పర్యటన యథావిధిగా కొనసాగనుందని, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం సిఎం చంద్రబాబు పర్యటన రద్దు అయినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
