వాంబే కాలనీలో కూలిన మెట్లు

May 16,2024 23:17 #Vambe colony fallen steps
Vambe colony fallen steps

 ప్రజాశక్తి -మధురవాడ : వాంబేకాలనీలో మెట్లు కూలిన ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం… జివిఎంసి 7వ వార్డు పరిధిలోని వాల్మీకి అవాస్‌ యోజన అంబేద్కర్‌ పథకంలో సుమారు 20 ఏళ్లు కిందట అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 3400 ఇళ్లను 82 బ్లాక్‌ల కింద నిర్మించారు. అప్పటిలో నగరంలోని రహదారులకు ఇరువైపులా ప్రభుత్వ స్థలంలో ఉన్న వారిని గుర్తించి ఇక్కడ ఇళ్లు కేటాయించారు. ఆ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో బీటలు వారి, ఇళ్ల పెచ్చులు రాలిపోతున్నాయి. ఓ భవనం వద్ద గత ఏడాది మెట్లు మార్గం కూలిపోయింది. బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి 40బి నెంబర్‌ బ్లాక్‌ వద్ద మెట్లు కూలిపోయాయి. ఇది రాత్రి పూట జరగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని భవనాలకు మరమ్మతులు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

➡️