ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : విజయనగరం నగర పాలక సంస్థ అధికారులు, రెవెన్యూ విభాగం సిబ్బంది మార్చి నెలాఖరు నాటికి శత శాతం పన్నులు వసూలు చేస్తారా అంటే చెప్పలేని పరిస్థితిలో నేడుంది. మీటింగ్ లు మీద మీటింగ్ లు పెట్టీ శత శాతం పన్నులు మార్చి నెలాఖరు నాటికి వసూలు చేయాలనీ కమీషనర్ ఆదేశాలు జారీ చేసిప్పటికీ అమలు సాధ్యం కాలేదు. ఏడాది పాటు రెవెన్యూ వసూలు కోసం ఉన్న శాఖ నిద్రావస్థలో ఉండటం వలన నేడు ఈ దుస్థితికి కారణం. నగర పాలక సంస్థ కు వచ్చే అధికారులు ఎవ్వరూ కూడా ఏడాదిలో రెండు అర్ధ సంవత్సర కాలంలో పన్నులు వసూలు చేయడమనేది చేయాల్సి ఉంది. ఆ పని చేయకపోవడం వలన కేవలం మార్చి నెలలో లేదా ఫిబ్రవరి నెల నుంచి పన్నులు వసూలు పై హడావిడి చేయడం కనిపించడం వలన శత శాతం పన్ను వసూలు అనేది నగర పాలక సంస్థ చరిత్రలో వసూలు చేసిన దాఖలాలు లేవు.విజయనగరం నగర పాలక సంస్థ లో మొత్తంగా
52.30 కోట్లు రూపాయిలు బకాయిలతో కలుపుకొని వసూలు చేయాల్సి ఉంది. మార్చి 11 తేదీ నాటికి
25.57 కోట్లు మాత్రమే వసూలు అయింది అంటే కేవల.49 శాతం. వసూలు అయ్యింది.ఈమూడు రోజులు కలుపుకుంటే సుమారుగా 50 శాతానికి దగ్గరగా వసూలు చేసే అవకాశం ఉంది.అంటే ఇంత వరకు 50 శాతం కూడా దాటని పన్నులు వసూలు శత శాతం ఎలా వసూలు చేస్తారో నగర పాలక సంస్థ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
వాస్తవానికి ప్రతి ఏడాది నగర పాలక సంస్థ కు రావాల్సిన పన్నులు డిమాండ్ 31.83 కోట్లు, ఇందులో ఈ ఏడాది పన్నులు వసూలు..21.49 కోట్లు వచ్చింది.అంటే పాత బకాయిలు రూ.21 కోట్లు ఉంటే అందులో కేవలం 4 కోట్లు పైగా వసుకు కావడం జరిగింది .అంటే ఇంకా పాత మొండి బకాయిలు సుమారుగా రూ.17 కోట్లు పైన రావల్సి ఉంది. మరో వైపు ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు రూ.33.55 కోట్లు రావల్సి అండగా కేవలం కోటి ఆరు లక్షలు మాత్రమే మొన్నటికి వసూలు కావడం జరిగింది.
…
సిబ్బంది అన్నా ఎందుకు నిర్లక్ష్యం..
గత ఐదేళ్ల కాలం క్రితం వరకు కేవలం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు,బిలింగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉండి పన్నులు వసూలు చేసేవారు. అప్పుడు సుమారుగా ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి 70 శాతం వరకు వసూలు చేసే వారు. ప్రస్తుతం గత ప్రభుత్వం నియమించిన సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత రెవెన్యూ కార్యదర్శులు 59 మంది అన్ని వార్డుల్లో అన్నారు. కానీ పురోగతి మాత్రం పన్నులు వసూళ్లు లో కనిపించడం లేదు.ఎక్కడ తప్పు జరుగుతుందో అధికారులు దృష్టి సారించాల్సిన ఉంది.వాస్తవానికి ప్రతి రెండు అర్ధ సంవత్సర లో పన్నులు వసూలు పై దృష్టి సారిస్తే ఈ పరిస్తితి వచ్చేది కాదు. ఈ పరిస్తితి మారితే తప్ప శత శాతం పన్నులు వసూలు సాధ్యం కాదు,ఇలా ప్రతి ఏటా మొండి బకాయిల పెరిగిపోవడం తప్ప తగ్గడం ఉండదు.
..
పాలకవర్గం సహకారం శూన్యం
మరో వైపు నగర పాలక సంస్థ లో డబ్బులు ఉన్నాయంటే ఏదో ఒక అభివృద్ది కార్యక్రమాలు పేరు చెప్పి వాటిని వాడుకునేందుకు ముందుకు వచ్చే పాలకులు పన్నులు వసూలు చేయించడంలో వారి సహకారం మాత్రం ఉండటం లేదు.అధిక శాతం వ్యాపారులు,గృహ సముదాయాలు వారు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా గృహ సముదాయాలు వారు చెల్లించాల్సి ఉంది. వారు చెల్లించడంలో నిర్లక్ష్యం వలన పన్నులు బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటితో
పాటు పన్నులు వసూలు లో రాజకీయ నాయకులు సిఫార్సులు కూడా మొండి బకాయిల పేరుకోపోవడానికి కారణంగా తెలుస్తుంది. పన్నులు సకాలంలో కడితే ప్రజలకు కూడా సౌకర్యాలు కల్పించాలనే అడిగే హక్కు కూడా ఉంటుంది.దాని పై అవగాహన పెంచి పన్నులు వసూలు అయ్యే విధంగా పాలకులు సహకరించాల్సిన అవసరం ఉంది.ఎన్ని వీడియోలు,ఎన్ని ప్లెక్సీలు వేసిన కేవలం సగం మంది కి మాత్రమే చేరుతాయి.అదే వార్డుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ఎన్నికల్లో ఓట్లు కోసం వెళ్లి అవగాహన కల్పించే విధంగా పన్నులు వసూలు పై దృష్టి పెడితే కనీసం 80 నుంచి 90 శాతం వసూలు అయ్యేందుకు వీలు ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి అయిన పన్నులు వసూలు పై ముందే నుంచే దృష్టి సారించడం వలన వసూలు పెరిగే అవకాశం ఉంటుంది.
