బాణాసంచాపై జూన్‌ 5 వరకు నిషేధం : కలెక్టర్‌

May 21,2024 15:12 #2024 election, #collecter, #eleuru

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : ఏలూరు జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ, రవాణా, విక్రయాలపై జూన్‌ 5వ తేదీవరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శాంత భధ్రతలను దృష్టిలో ఉంచుకొని నిషేధాజ్ఞలను విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిషేధాజ్ఞలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా, బాణాసంచా కాల్చడం, తయారీ, రవాణాలను నిలుపుచేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, రెవిన్యూ డివిజనల్‌ అధికారులను, జిల్లాలోని తహశీల్దార్లను ఆదేశించారు.

➡️