ప్రజాశక్తి-వీరపునాయునిపల్లె జిఎన్‌ఎస్‌ఎస్ అడవిచెర్ల పల్లె నుంచి పాపాఘ్నికి నీటిని విడుదల చేయడం వల్ల 15 వేల ఎకరాలకు నీరందుతుందని కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లి మండలం జి ఎన్ ఎస్ ఎస్ 36 కీమీ. పాయింట్ అడవిచెర్ల పల్లి వద్ద నుండి పాపాగ్ని కి నీటిని విడుదల చేశారు. ముఖ్య అతిధులుగా కలెక్టర్ , కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కష్ణచైతన్య రెడ్డి, నాయకులు పుత్తా నరసింహ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవిచెర్లపల్లి వద్ద నుంచి 12 కిలో మీటర్ల పొడవునా మగిమేరు వంక ద్వారా నీటిని విడుదల చేసి పాపాగ్ని నీటిని పంపి అక్కడ నుంచి సమీపంలోని పలు ప్రాంతాలకు సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు ఇచ్చే కార్యక్రమాన్ని కమలాపురం శాసనసభ్యులు ప్రణాళిక బద్దంగా రూపకల్పన చేశారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు తక్కువ కురిసిన కారణంగా కమలాపురం నియోజకవర్గంలో గ్రౌండు వాటర్ తగ్గిందని, తాగునీటి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి సమయంలో తన తండ్రి సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులతో చర్చించి నీటిని విడుదల చేశా మన్నారు. ఈ నీరు 4 మండలాలకు కమలాపురం, వల్లూరు, పెండ్లిమర్రి, వి ఎన్ పల్లి మండ లాలకు ఆయకట్టు పెరిగే విధంగా గ్రౌండు వాటర్ రీఛార్జి చేశా మన్నారు. కార్యక్రమంలో పులివెందుల ఆర్‌డిఒ భాను శ్రీ, ఇర్రిగేషన్ ఎస్‌ఇలు మల్లికా ర్జునరెడ్డి, వెంకట్రామయ్య, తహశీల్దార్ లక్ష్మీ దేవి, నాయకులు పాల్గొన్నారు.
