కార్మికులకు మద్దతుగా మాట్లాడుతున్న ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చేసిన పనికి సరైన వేతనం ఇవ్వకుంటే కార్మికులు ఎలా బతకాలని పలు సంఘాల నాయకులు ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం 14వ రోజుకు చేరగా శిబిరాన్ని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రెడ్‌బాషా సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, శ్రమ దోపిడీ చేయొద్దని అన్నారు. ఆరేళ్లుగా పని చేస్తున్న 40 మంది కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయడంలో తాత్సారం తగదన్నారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులతో పాటు వీరి పేర్లు ఏపి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్లో నమోదైనా వివక్ష ఎందుకని ప్రశ్నించారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో కార్మికుల సంఖ్య పెంచాలని, పని భద్రత కల్పించాలని, దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. పిడిఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో పిడిఎం సీనియర్ నాయకులు ఎన్.రామారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్‌వలి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు వి.కోటానాయక్, ఎంఐఎం నాయకులు షేక్ మౌలాలి, ఎంహెచ్‌పిఎస్ రాష్ట్ర నాయకులు షేక్ మస్తాన్‌వలి, బీసీ సంఘం నాయకులు బి.శ్రీనివాసరావు ఉన్నారు. దీక్షల్లో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సాల్మన్, నాయకులు నరసింహారావు, జె.శ్రీను, వై.ఇంద్రయ్య, కె.మరియదాసు, కె.దేవదానం, సమాధానం, నాగరాణి, జె.వీరయ్య, జి.చందు, జి.చిట్టిబాబు, యు.రాజు, ఎ.లతా, వి.నాగమణి, పి.కోటేశ్వరరావు, జె.ప్రేమ్‌కుమార్, షేక్ ఖాదర్‌వలి, జి.రాంబాబు, సెల్వి, జగన్నాథం, సాల్మన్ పాల్గొన్నారు.
