జమ్మలమడుగు సమగ్ర అభివద్ధికి శ్రీకారం : కలెక్టర్‌

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగులో సమగ్ర అభివద్ధికి శ్రీకారం చుట్టబోతున్నామని కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. బుధవారం జమ్మలమడుగులో కలెక్టర్‌ పర్య టించారు. మండల పరిధిలోని దేవగుడి, మోరగుడి పట్టణంలోని పతంగే రామ న్నరావు ఉన్నత పాఠశాలలో స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన మాటా ్లడుతూ ఈ మూడు ప్రదేశాలలో మెగా ఇంటిగ్రేటెడ్‌ కిచెన్‌లను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు భోజనాన్ని అందించేందుకు స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. ప్రిన్సిపల్‌, సిబ్బందితో సంభాషించారు. ప్రభు త్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సోలార్‌ కంపెనీలో పని చేసే వారికి నైపుణ్యం నేర్పిం చేందుకు అనుకూలంగా ఉందాలేదా అలాగే ఫైర్‌ స్టేషన్‌ వద్ద 100 పడకల వైద్య శాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ సాయిశ్రీ, జమ్మలమడుగు తహశీల్దార్‌ ,ఎంఇఒలు పాల్గొన్నారు.

➡️