వంద శాతం ప్రగతి సాధించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-కురబలకోట/ములకలచెరువు/పిటిఎం ప్రభుత్వ అభివద్ధి పథకాల అమలలో బాధ్యతాయుతంగా పనిచేసి చిత్తశుద్ధితో వంద శాతం ప్రగతి సాధించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం కురబలకోట, ములకలచెరువు, పిటిఎం మండలాలలో జిల్లా కలెక్టర్‌ విస్తతంగా పర్యటించి తహశీల్దార్‌, ఎంపి డిఒ కార్యాలయాలలో మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుపరచి నూరు శాతం లక్ష్యాలను సాధించాలని గ్రామ, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్‌ అసైన్మెంట్‌ భూములు, చుక్కల భూములు, ఇనాం భూముల పరిశీలనను పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్క రించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని బాగానే అమలు చేస్తున్నందుకు మండల్‌ అధికారులను అభినందించారు. పిజిఆర్‌ఎస్‌ దరఖాస్తులు అందిన వెంటనే అదే రోజు లేదా మరుసటి రోజు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేయా లన్నారు. ఏదైనా చట్టపరిధిలో నోటీసులు ఇవ్వాల్సి ఉంటే నోటీసులు ఇచ్చి పది పది హేను రోజుల్లో ఫిర్యాదును పరిష్కరించాలని సూచించారు. గత ప్రభుత్వ హ యాంలో సర్వే రాళ్లపై వేసిన చిత్రాలు, అక్షరాలు చెరిపి వేసే కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. ఏ ఒక్క రాయిని కూడా వదలకుండా నూరు శాతం పనిని పూర్తి చేయాలని సూచించారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు వందశాతం అపార్‌ ఐడి జనరేట్‌ చేయాలన్నారు. హౌస్‌ హోల్డ్‌ జియో ట్యాగింగ్‌లో ప్రగతి బాగానే ఉందన్నారు. బిఎల్‌, ఎల్‌ఎల్‌, ఆర్‌ఎల్‌, ఆర్సి వారీగా ఇళ్ల ప్రగతిని సమీక్షించారు. ప్రజలందరికీ ప్రభుత్వం ఇసుకను ఉచి తంగా అందిస్తోందన్నారు. కురబలకోట మండలం కంటేవారిపల్లెలోని ఎంపిపి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్‌ ఆకర్షణీకంగా సందర్శించి తనిఖీ చేశారు. పాత మొలకలచెరువు పంచాయతీ దండువారిపల్లె హౌసింగ్‌ లేఔట్‌ను కలెక్టర్‌ అధికారులతో సందర్శించి నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించారు. పిటిఎం మండలం తుమ్మరకుంట గ్రామంలో ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూమిని కలెక్టర్‌ పరిశీ లించారు. సమావేశంలో మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, హౌసింగ్‌ పీడీ శివయ్య, తహశీల్దార్లు, ఎంపిడిలు, ఎంఇఒలు, హౌసింగ్‌ ఎఇలు, ఆర్‌ఐలు, విఆర్‌ఒలు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ పాల్గొన్నారు.

➡️