ప్రజాశక్తి-పీలేరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సిసి రోడ్ల నాణ్యతలో రాజీ పడకుండా త్వరితగతిన అవి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కెవిపల్లి మండలం, సొరకాయలపేట పంచాయతీ, వంకవారవడ్డిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులను కలెక్టర్ డ్వామా పీడీ వెంకటరత్నం, ఎంపిడిఒ సుధాకర్, ఎపిఒ నాగరాజ, ఎఇ పి. సుబ్రత్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యత, పొడవు, వెడల్పు, అంచనా ఖర్చు వివరాలను కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలు సుకున్నారు. రూ.8 లక్షల ఖర్చుతో ప్రధాన రహదారి 164 మీటర్ల పొడవు, వెడ ల్పు 3.75 మీటర్లతో నిర్మిస్తున్నట్లు అధికారులు కలెక్టరుకు వివరించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని కలెక్టర్ సూచించారు. అంతకు ముందు కలెక్టర్ మండలంలోని ఎపిమోడల్ స్కూల్‌ను సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల నిర్వ హణపై ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. పాఠశాలలో అపార్ ఐడి జనరేషన్ స్థితిని అడిగి తెలుసుకున్నారు. అపార్ లేని వారందరికీ త్వరగా అపార్ ఐడి జనరేట్ చేయాలని పంచాయతీ కార్యదర్శి రాధిక, విఆర్‌ఒ, ఎంఇఒ రెడ్డిబాషా పాఠశాల హెచ్‌ఎంలను ఆదేశించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్‌డిఒ శ్రీనివాస్, డ్వామా పీడీ వెంకట రత్నం, తహశీల్దార్ క్రాంతి కుమార్, ఎంపిడిఒ సుధాకర్, ఎంఇఒ, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.బాల్యవివాహాలు సాంఘిక దురాచారం : బాల్య వివాహాలు చేయడం ఓ అసాంఘిక దురాచారమని కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. బాల్య వివాV్‌ా ముక్త్ భారత్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కెవిపల్లి ఎంపిడిఒ కార్యాలయంలో కలెక్టర్ బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివద్ధికి బాల్య వివాహాలు ఆటంకం కలిగిస్తాయని అన్నారు. అంతేకాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను కూడా అది దూరం చేస్తుందని చెప్పారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ సాకారానికి కషి చేద్దామంటూ బాల్యవివాహాలకు వ్యతిరేకంగా కలెక్టర్ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.