డిజిటల్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి – కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి

ప్రజాశక్తి-రామాపురం కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఉపయో గించుకొని డిజిటల్‌ నైపుణ్యాలను పెంపొం దించుకోవాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి విద్యా ర్థులకు సూచించారు. మండలంలోని ఆదర్శ పాఠ శాలలో బుధవారం ఐసిఐసిఐ బ్యాంకు వారు కార్పొ రట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా అందించిన నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను, ఆస్ట్రానమీ ల్యాబ్‌నుకలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మనం కత్రిమ మేధతో పోటీపడే ప్రపం చంలో ఉన్నామని, అందువల్ల డిజిటల్‌ నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐసిఐసిఐ బ్యాంకు వారు తమ నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను, ఆస్ట్రానమీ ల్యాబ్‌ను విద్యా ర్థులు అందరూ ఉపయోగించుకుని వద్ధిలోకి రావా లన్నారు. ఐసిఐసిఐ బ్యాంకు వారు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఎపి మోడల్‌ పాఠశాలకు ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. తాను చదువుకునేటప్పుడు ఇలాంటి అవకాశాలు లేవని ఇప్పటి విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే గొప్ప స్థాయికి వెళ్ళవచ్చని విద్యార్థులకు సూచించారు. కంప్యూటర్‌ను, మొబైల్‌ ఫోన్లను మంచి విషయాలకు, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పారు. సోషల్‌ మీడియాను ఉపయోగించవద్దని సూచించారు. అనంతరం పాఠశాలలో అన్ని వసతులు బాగున్నాయా లేవా అని విద్యార్థులను అడిగారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డిఇఒ శివ ప్రకాష్‌రెడ్డి, ఎంఇఒ రామకష్ణుడు, పాఠశాల ప్రిన్సిపల్‌ శ్యామ లాదేవి , ఐసిఐసిఐ బ్యాంకు రాయచోటి శాఖ మేనేజర్‌ ఏసుదాసు పాల్గొన్నారు. గహ నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలి రాయచోటి : మండలంలోని దిగువ అబ్బవరం గహ నిర్మాణ లే అవుట్లలో చేపట్టిన అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అధికారులను ఆదేశించారు. లే అవుట్‌లలో జరుగుతున్న పనులను బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరు లే అవుట్‌, ఎపి మోడల్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న లే అవుట్లలో సిసి రోడ్ల నిర్మాణ ప్రగతి, విద్యుత్‌ పోల్స్‌, లైన్ల ఏర్పాటు, నీటి వసతి, ఇతర మౌలిక వసతుల కల్పన, ఆర్చి నిర్మాణం తదితరాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీ చేశారు. చేపట్టిన పనులను ఈనెలఖరులోగా నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పనుల పూర్తిలో భాగంగా రోజువారి ప్రగతిని తనకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్‌డిఒ శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ దయాకర్‌ రెడ్డి, హౌసింగ్‌, డ్వామా పీడీలు శివయ్య, వెంకటరత్నం, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ప్రసన్నకుమార్‌, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సహదేవరెడ్డి విద్యుత్తు, హౌసింగ్‌ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

➡️