ప్రజాశక్తి-బాపట్ల : నిజాంపట్నం హార్బర్ ను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటరమణ, జిల్లా అధికారులు సందర్శించారు. తొలుత సూర్యలంక నుంచి నిజాంపట్నం వరకు బోటు లో కలెక్టర్ వెంకటరమణ ప్రయాణించారు. అనంతరం నిజాంపట్నం హార్బర్ ను సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం బోటు యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు టిడిపి అధ్యక్షులు బొమ్మిడి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
