బంగారు పతక విజేతలకు కలెక్టర్‌ అభినందన

బంగారు పతక విజేతలకు కలెక్టర్‌ అభినందన

ప్రజాశక్తి -పాడేరు : జాతీయ స్థాయి పరుగు పోటీలలో బంగారు బహుమతులు గెలుచుకున్న ఇద్దరు క్రీడాకారులను జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత అభినందించారు. గతనెల 25 నుండి 28 వరకు ఉత్తరప్ర్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఖేలో భారత్‌ యూత్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందేల పోటీలలో పాడేరు నుండి కొర్రా గోపి, కిల్లో బుద్దు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందినట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎ. జగన్మోహన్‌ తెలిపారు. 5 కిలోమీటర్లు పరుగు పందెంలో కొర్రా గోపి మొదటి స్థానం సాధించి బంగారు పతాకాన్ని, 10 కిలోమీటర్లు పరుగు పందెంలో కిల్లోబుద్దు మొదటి స్థానం సాధించి బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారనివివరించారు. బంగారు పతక విజేతలను జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీతను సోమవారం తన చాంబర్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షిస్తూ, అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీదాధికారి జగన్మోహనరావు పాల్గొన్నారు.

క్రీడాకారులను అభినందిస్తున్న కలెక్టర్‌ విజయసునీత

➡️