ప్రజాశక్తి-కంభం : కంభం పట్టణంలోని సిఎల్‌ఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ బాషా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేలా తమ అడుగులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థీ సమాజంలో క్రమశిక్షణతో నడవాలన్నారు. విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎల్‌ఆర్ ఇంటర్మీడియట్ కాలేజ్ డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, అధ్యాపక బృందం గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్, షేక్ షరీఫ్, ఎం శ్రీనివాస్ రెడ్డి, వి వనజ, కే బ్యూలా, పాలిశెట్టి నవీన్, రామారావు, శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
